అంబేడ్కరుడ్కి దండేయడు.. రాజీవ్ విగ్రహాం పెడతాడట..?

 అంబేడ్కరుడ్కి దండేయడు.. రాజీవ్ విగ్రహాం పెడతాడట..?

Rajiv Gandhi VS Ambedhkar

Loading

నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య గొడవ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను పెంచింది. తాజాగా రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు అంశం మరింత హీట్ ను పెంచుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట.. అమరవీరుల స్మారక జ్యోతి పక్కన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన నమూనాలను విధివిధానాలను ఖరారు చేసింది.

అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వ రూపురేఖలను.. కేసీఆర్ గుర్తులను చెరిపేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రైన రేవంత్ రెడ్డి పలుమార్లు మీడియా సమావేశాల్లోనూ… భారీ బహిరంగ సభల్లో ప్రకటించారు. అన్నట్లుగానే టీఎస్ నుండి టీజీగా రాష్ట్ర పేరును (కోడ్) మార్చారు.. ఆ తర్వాత అధికారక చిహ్నాన్ని మార్చాలని చూశారు.తెలంగాణ వాదుల నుండి. మేధావుల నుండి.. ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి ఆ విషయం పక్కకు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటు చేయాల్సిన స్థలంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది.

మరి ముఖ్యంగా తెలంగాణ వాదులు, ఉద్యమ కారులు,ప్రజలు,మేధావి వర్గం నుండి భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.. రాజీవ్ గాంధీ సంస్కరణల వల్లనే దేశం అభివృద్ధి చెందింది.. హైదరాబాద్ లాంటి మహానగరాలకు ఐటీ తదితర కంపెనీలు వచ్చాయి. ఆయన విగ్రహాం ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు కానీ ఇలా తెలంగాణ తల్లి ఉండాల్సిన స్థలంలో ఏర్పాటే మాకు నచ్చడం లేదని బాహటంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం పక్కన ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేయరు కానీ తెలంగాణ తల్లి విగ్రహాం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాం పెడతారా అని అంబేద్కరిస్టులు, బహుజనులు, అంబేద్కర్ అభిమానులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. విగ్రహాం ఏర్పాటుకు మాకు అభ్యంతరం లేదు కానీ ఇలా అంబేద్కర్ కు కనీసం పూల వేయకుండా విగ్రహాం పెట్టుడు వివాదస్పదంగా మారుడు ఎంతవరకు కరెక్టు అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *