నేను పని చేసే సీఎం.. ఫామ్ హౌస్ సీఎం కాదు
నేను ప్రజల కోసం.. ఓట్లేసి గెలిపించిన ఓటర్ల కోసం పని చేసే సీఎం.. ఫామ్ హౌస్ లో కాళ్లపై కాళ్ళేసుకుని కూర్చునే సీఎం ను కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలకు మధ్య ఎన్నో సంబంధాలుంటాయి.. కేంద్రం నుండి మనకు రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైన సరే ఢిల్లీకి వెళ్తానని ఆయన స్పష్టం వేశారు.
నేను నా స్వార్ధం కోసం ఢిల్లీకెళ్లడం లేదు. కేంద్రం నుండి మనవి సాధించుకోవడం మన హక్కు. నేను వాటికోసం ఢిల్లీకెళ్తున్నాను. కానీ కొంతమంది దీన్ని రాజకీయాలు చేస్తున్నారు అని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17ను ఎలా నిర్వహించుకోవాలన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈరోజును కొందరూ విలీనం అంటున్నారు. మరికొంతమంది విమోచన దినోత్సవం అని సంభోదిస్తున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరపడం అని సముచితం అని భావించాము.
1948లో తెలంగాణ ప్రజల నిజాం రాజరిక వ్యవస్థను కూలదొసి ప్రజాపాలనకు నాంది పలికారు. అందుకే ప్రజాకోణాన్ని జోడిస్తూ ఈ పేరును పెట్టాం అని ఆయన తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” పర్యావరణ పునర్జీవం కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లేక్ సిటీగా పేరు గాంచింది. కానీ లేక్ లు మాయమై కేవలం సిటీ మాత్రమే మిగిలింది. ఎవరెన్ని కుట్రలు చేసిన కుతంత్రాలు చేసిన కానీ అక్రమ నిర్మాణాలను హైడ్రా వదిలిపెట్టదు అని పునరుద్ఘాటించారు.