అల్లు అర్జున్ అరెస్ట్ ఒకే.!. మీ బ్రదర్స్ ఎప్పుడు రేవంతూ..?
ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు కారణం అని ఇటు సంధ్య థియోటర్ మేనేజర్, సెక్రూరిటీ సిబ్బందితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లపై కేసు నమోదు చేసి జైలుకు పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. తనకు ఎలాంటి సంబంధం లేదు. మేము ముందస్తుగా భద్రత కల్పించాలని స్థానిక పోలీసులతో పాటు సీపీని కోరాము . అటు నుండి ఎలాంటి స్పందన లేదు.
పైకి తమ వైపల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే తమపై కేసులను నమోదు చేశారు అని ఐకాన్ స్టార్ తరపున న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఏకంగా మీ వైపల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారా..? అంటూ అక్షింతలు వేసింది. ఈ క్రమంలోనే ఇటు బన్నీ అభిమానులు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిననేతలు మరోవైపు రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ సర్కారు తీరుపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు.
ఇటీవల సాక్షాత్తు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఊరిలో ఓ సర్పంచ్ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఆగడాలను భరించలేక.. వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి సంబంధం లేని అల్లు అర్జున్ ను బాధ్యుడ్ని చేసి కక్ష గట్టి అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డికి తన బ్రదర్స్ పై వచ్చిన ఆరోపణలు గుర్తుకు రాలేదా…?. సాక్షాత్తు సర్పంచే లేఖ రాసి మృత్యువాత పడిన వారిపై ఎలాంటి చర్యలుండవు . కానీ ఓ పంక్షన్ లో తన పేరు మరిచిపోయాడనే ఈగో హర్ట్ అయి రేవంత్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా అని వారు విమర్శిస్తున్నారు.