అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు..!

 అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు..!

Key announcement on Mohan Babu’s arrest…!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో అరెస్టైన నటుడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అరవింద్ తరపున న్యాయవాది కోరగా.. కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదావేస్తే తక్షణమే బెయిల్ మంజూరుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరగా.. ప్రభుత్వ తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని వాదించారు.

బెయిల్, క్వాష్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వ లాయర్ కోరారు. తన క్లైంట్‌పై పెట్టిన కేసు కొట్టేయాలని 118 (1) బీఎన్‌ఎస్ అల్లు అర్జున్‌కు వర్తించదని ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే మీ అభ్యంతరం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఈఘటనకు పాల్పడలేదని, తన క్లైంట్‌కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిరంజన్ రెడ్డి వాదించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *