రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కౌంటర్…!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఐకాన్ స్టార్..తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ కౌంటరిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్య థియోటర్ దగ్గర సంఘటనపై మాట్లాడుతూ హీరో అల్లు అర్జున్ కు బెనిఫిట్ షో చూడటానికి స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
అనుమతి ఇవ్వకపోయిన హీరో అల్లు అర్జున్ కావాలనే భారీ ర్యాలీగా వచ్చి మరి సినిమా చూశాడు. సినిమా చూడటమే కాకుండా రేవతి అనే మహిళ చనిపోయిన కానీ మళ్లీ అదే విధంగా అక్కడ నుండి వెళ్లిపోయారు. పోలీసులు వచ్చి అనుమతి లేదని చెప్పిన వినలేదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి క్లారిటీచ్చారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ” నేను షో చూడటానికి.. సంధ్య థియోటర్ కు వెళ్లడానికి పోలీసుల అనుమతి లేదని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చెప్పడం అబద్ధం. పోలీసులు అనుమతిచ్చారు. నేను అక్కడకి వచ్చినప్పుడు పోలీసులే ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఒకవేళ అనుమతి లేదని చెప్పి ఉంటే నేను వెళ్లకపోయేవాడ్ని.. ఎవరూ నా దగ్గరకు వచ్చి అనుమతి లేదని చెప్పలేదు అని బాంబు పేల్చారు.