కేటీఆర్ కు సీనియర్ మంత్రి బంఫర్ ఆఫర్…!

KTR stands by the child..!
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు శనివారం అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రైతు భరోసా, రైతురుణమాఫీ అంశాలపై సుధీర్ఘ చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ అంటూ ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. యాబై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. సిరిసిల్ల కి వెళ్లిన.. గజ్వేల్ కి వెళ్లిన.. సిద్ధిపేట కెళ్లిన.. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్దాము.
అక్కడ భగీరథ నీళ్లు వస్తున్నాయేమో అని చూద్దాము. మిషన్ భగీరథ నీళ్లు వస్తే నేను నా మంత్రి పదవికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. నీళ్ళు రాకపోతే కేటీఆర్ చేస్తాడా అని బంఫర్ ఆఫర్ ఇచ్చారు.
