ఒక్కరూ ఔట్ – మిగతా ఇద్దరూ డౌట్

 ఒక్కరూ ఔట్ – మిగతా ఇద్దరూ డౌట్

BRS MLAs

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెందిన దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరడమే కాకుండా అనర్హత వేటు వేయాలని పిటిషన్ కూడా ఇచ్చింది. స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.

గత నెల బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఈ రోజుకు తీర్పుపై వాయిదా వేసింది. ఈ రోజు తీర్పును వెలువరిస్తూ నాలుగు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్టేటస్ రీపోర్టు ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. అంతేకాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు ఇస్తారు. ఎప్పుడు వారి వాదనలు వింటారు. ఎప్పుడు వారిపై చర్యలు తీసుకుంటారు . ఇలా ప్రతీది వివరిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఆదేశిస్తూ నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలను జారీ చేసింది.

అయితే ఇంతవరకు బాగానే ఉంది . కానీ అనర్హత వేటు పడితే దానం నాగేందర్ పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటికి దిగారు. దీంతో ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొంది.. మరోక పార్టీ గుర్తుపై ఎంపీగా బరిలోకి దిగి సాంకేతికంగా అనర్హత వేటుకు గురవ్వడానికి అవకాశాలున్నాయి.

కానీ మరోవైపు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహారిలు సాంకేతికంగా పార్టీ మారినట్లు ఎలాంటి రుజువులు లేవు. ఇటీవల స్పీకర్ విడుదల చేసిన గెజిట్ లో కూడా వీళ్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైన కానీ సాంకేతిక ఫరంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. చూడాలి మరి స్పీకర్ సాబ్ ఏమి చేస్తారో..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *