జనసేన లో “ఆమెదే” వన్ మ్యాన్ షో
జనసేన అంటే ముందుగా గుర్తుకోచ్చేది ఆ పార్టీ చీఫ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మంత్రి నాదేండ్ల మనోహార్… ఆ తర్వాత నాగబాబు … ఆ తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేలు అని.. కానీ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో జనసేన గెలుపొందిన ఏకైక మహిళ సీటు నెలిమర్ల. నెలిమర్ల స్థానం టీడీపీ అడిగిన కానీ మిత్రపక్షం ధర్మాన్ని అనుసరించి ఆ స్థానాన్ని జనసేన పార్టీకి అప్పజెప్పారు ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు.
నెలిమర్ల నుండి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకం మాధవి బరిలోకి దిగారు.కూటమి ధర్మాన్ని అనుసరించి ఇష్టం లేకపోయిన సరే బాబు చెప్పారు కాబట్టి అందరూ సపోర్టు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో నెలిమర్ల నుండి లోకం మాధవి భారీ మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. క్షేత్రస్థాయిలో కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి నేత వరకు అందరూ అహర్నిశలు కష్టపడి మాధవి గెలుపుకోసం తీవ్ర ప్రయత్నించారు.
అక్కడిదాక బాగానే ఉంది. అసలు కథ గెలుపొందిన తర్వాతనే మొదలైందంట. ఎమ్మెల్యేగా గెలుపొందిన లోకం మాధవి తన గెలుపుకోసం కష్టపడ్డా.. మొదటి నుండి తనతో ఉన్న వార్ని సైతం పట్టించుకోవడం మానేశారంట. అంతేకాదు నిన్న కాక మొన్న తనవైపు వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇటు జనసేన పార్టీ శ్రేణులను, అటు టీడీపీ బీజేపీ నాయకులను,కార్యకర్తలను గాలికి వదిలేశారంట. అధికారక కార్యక్రమమైన కానీ పార్టీ కార్యక్రమమైన కానీ మొదటి నుండి ఉన్నోళ్లకు కాకుండా మధ్యలో వచ్చినవాళ్లకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారంట.
రేపు నామినేటేడ్ పదవులను సైతం వీళ్లకు కాకుండా తనతో ఉన్న తన చుట్టూ ఉన్నవాళ్లకే ఇవ్వాలని సదరు ఎమ్మెల్యే పిక్స్ అయ్యారంట. ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కష్టపడిన వార్ని.. పార్టీ కోసం పని చేసినవారిని కాదని మధ్యలో వచ్చిన వారికి ఎలా ఇస్తారని జనసైనికులతో పాటు తెలుగు తమ్ముళ్ళు,కమలం నేతలు వాపోతున్నారంట.. త్వరలోనే ఇటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, అటు టీడీపీ చీఫ్ చంద్రబాబు,బీజేపీ చీఫ్ పురందేశ్వరిని కల్సి తమ ఆవేదనను వివరించి పిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయిన రాజకీయ నాయకుడంటే పదవులు వచ్చేవరకే కార్యకర్తలు.. నేతలను పట్టించుకుంటారు ఆ తర్వాత మధ్యలో వచ్చినవాళ్లకే అందలం ఎక్కిస్తారనే ఈ చిన్న లాజిక్ వీళ్లకు తెలవదా అని విజయనగరం జిల్లా ప్రజలు గుసగుసలాడుకుటున్నారు.