సన్ రైజర్స్ , హెచ్ సీఏ వివాదంలో ట్విస్ట్..!

SRH-and-HCA
సింగిడి న్యూస్ – క్రికెట్
ఐపీఎల్ మ్యాచులకు అదనంగా ఉచిత టికెట్లను ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహాన్ రావు తమను బెదిరిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తమ హోం గ్రౌండ్ ను మార్చుకొవాల్సి ఉంటుంది. అందుకు అనుమతి ఇవ్వాలని సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ సీఏ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే.
ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ గా స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారు. తప్పు చేశారని తెలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చారించారు కూడా. తాజాగా ఈ వివాదంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.
అందులో భాగంగా ఇరువర్గాల మధ్య ఉన్న సమస్యను పరిష్కారించుకుందాము అంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి సన్ రైజర్స్ యాజమాన్యం లేఖ రాసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఉప్పల్‌లో సన్ రైజర్స్ ప్రతినిధులు రోహిత్ సురేష్, కిరణ్‌తో హైదరాబాద్ క్రికెట్ అకాడమీ కార్యవర్గ సభ్యులతో చర్చలు జరగనున్నాయి.రేపు ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం కానున్నది.
