అల్లు అర్జున్ కి ఓ చట్టం..?. రేవంత్ తమ్ముళ్ళకి ఓ చట్టమా..?
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు నిరవాదికంగా వాయిదా పడిన అనంతరం మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ” సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం చాలా బాధాకరం.. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడాలి. ఈ ఘటనకు బాధ్యుడంటూ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది.
మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ కేంద్రంలోని కొండరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ సాయిరెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి సోదరులు తనను వేధిస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని లేఖ రాసి మరి మృతిచెందారు. అల్లు అర్జున్ విషయంలో సక్రమంగా పని చేసిన చట్టం సాయిరెడ్డి విషయంలో ఎందుకు సక్రమంగా పని చేయలేదు. అల్లు అర్జున్ కు ఓ చట్టం. రేవంత్ రెడ్డి సోదరులకు ఓ చట్టమా..?. అని ఆయన ప్రశ్నించారు.