RTC చైర్మన్ గా దేవినేని ఉమ
ఏపీలో నామినేటెడ్ పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో టీడీపీ అధినేత .. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ త్వరలోనే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన… పార్టీకి అండగా ఉన్న నాయకులను.. కార్యకర్తలను ఆదుకుంటాము.. నామినేటెడ్ పదవుల్లో వారికి స్థానం కల్పిస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే..
ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్తున్నట్లు కన్పిస్తుంది. అందుకే మంత్రి.. మాజీ ఎమ్మెల్యే అయిన దేవినేని ఉమ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం అసెంబ్లీ స్థానం కోల్పోయ్యారు. దీంతో ఉమకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వనున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్,పట్టాభిరామ్ కు ఏపీ సివిల్ సప్లై చైర్మన్,పీతల సుజాతకు ఎస్సీ కమీషన్ చైర్ పర్శన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దేవినేని ఉమ మాదిరిగా తెనాలి సీటు కోల్పోయిన ఆలపాటి రాజాకు సైతం మరో కీలక పదవి దక్కనుందని ఎన్టీఆర్ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.