ఢిల్లీలో రేవంత్ రెడ్డికి అక్షింతలు

 ఢిల్లీలో రేవంత్ రెడ్డికి అక్షింతలు

CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక రోజు ఉండగానే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఢిల్లీ పర్యటనలో ముందుగా అనుకున్న ప్రకారం తొలిరోజు అంటే శుక్రవారం పార్టీ పెద్దలతో సమావేశమవ్వాలి.. ఆ తర్వాత రోజు అంటే ఇవాళ శనివారం కేంద్ర మంత్రులతో పాటు ప్రధాన మంత్రి నరేందర్ మోదీని కలవాలని సీఎం షెడ్యూల్ లో ఉంది. అయితే శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ,మల్లిఖార్జున ఖర్గే లతో భేటీ అయ్యారు.

ఈ భేటీలో మీ ఆవేశపూరిత మాటలు.. దూకుడు స్వభావం వల్ల ప్రజల్లో పార్టీపై… ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దాన్ని తగ్గించుకోవాలి.. పార్టీలో ఉన్న సీనియర్లను జూనియర్లను కలుపుకోని ముందుకు వెళ్లాలి. ఇటీవల విదేశాలకు వెళ్లిన సమయంలో పరిశ్రమల పెట్టుబడుల గురించి ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఇన్ వాల్వ్ చేయకుండా తానే ఐటీ మినిస్టర్ లెక్క సీనియర్ మంత్రినే కాదు పార్టీలో సీనియర్ అయిన దుద్దిళ్ల శ్రీధర్ బాబును పక్కన బెట్టి నువ్వు హైలెట్ అవ్వడం ఏంటి.. పెట్టుబడుల గురించి సరైన సమాచారం ప్రజల్లోకి ఇవ్వకుండా అయోమయంలో నెట్టడం. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మెయిన్ పంప్ హౌజ్ ప్రారంభోత్సవానికి జిల్లాకు చెందిన సీనియర్ నేత కాదు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన భట్టి లాంటి నాయకుడ్ని ఎందుకు అనామకుడిగా ఉంచి వేరే చోటకు పంపారు..

ప్రతిపక్షమైన బీఆర్ఎస్ హామీలపై ప్రశ్నిస్తుంటే వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తూ పరుషపదజాలం వాడుతున్నారు.. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఇలాగే వ్యవహరించిందా..?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చాలా హుందాగా ఉండాలని తెలియదా ..? అని ఇలా పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారంట. ఇలాంటివి తగ్గించుకోకపోతే మున్ముందు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చారించారు.

అందుకే ఎప్పుడు ప్రస్తావన తేని కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంత్ రావుపై పొగడ్తలు వర్షం కురిపించడానికి కారణం ఇదే అని ఏఐసీసీ వర్గాల టాక్.తనపై ఇప్పటికే పలుమార్లు ఆధిష్టానానికి పిర్యాదులు వెళ్ళిన కానీ పట్టించుకోని రేవంత్ రెడ్డి ఈసారి రెండు రోజుల వ్యవధిలోనే పిర్యాదులు పొవడం .. వాటీని ఆధిష్టానం సీరియస్ గా తీసుకోవడం రేవంత్ రెడ్డిని మనస్థాపానికి గురి చేశాయి. అందుకే రేవంత్ రెడ్డి ముందుగానే హైదరాబాద్ తిరిగి వచ్చారు అని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *