మహిళను గదిలో బంధించి అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాకి చెందిన ఓ మహిళ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చింది.. అయితే సదరు మహిళకు ఉండటానికి ఇల్లు లేదు.. దీంతో తోటి ఉద్యోగి అయిన సంతోష్ తనకు ఇల్లు వెతకడానికి సాయం చేస్తానని, అంతలోపు తనతో వాళ్ల ఇంట్లో ఉండాలని తనతో పాటు తల్లి, చెల్లి కూడా ఉంటారని నమ్మించి ఇంటికి తీసుకు వెళ్లాడు.
ఇంటికి వెళ్లిన అనంతరం ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని గమనించిన మహిళ అతన్ని ప్రశ్నించగా అతడు ఆమెను ఒక గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
సదరు మహిళ అరిచి గోల చేయగా, తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. అయితే కొన్ని రోజులకు మహిళను బయట వదిలాడు, బాధిత మహిళ ఎన్ని సార్లు ఫోన్ చేసినా సంతోష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె పోలీసులని ఆశ్రయించి అతనిపై కేసు పెట్టడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది…