స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా

Anand Mahindra as Chairman of Skill University
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న కార్యక్రమం స్కిల్ యూనివర్సిటీ పేరుతో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించడం. ఇటీవల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు.
తాజాగా అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా పేరును ప్రకటించారు. మరో రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు అని ప్రకటించారు.
ఇటీవల ముచ్చర్లలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు… ఆ తెల్లారే ఆనంద్ మహీంద్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.