చంద్రబాబు కీలక నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్లతో జరుగుతున్న సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” అధికారులందరూ వేగం అందుకోవాలి..
ప్రజలు మమ్మల్ని అధికార పక్షంగా ఎన్నుకున్నారు.. మీతో సమర్ధంగా పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మాది. మళ్లీ 1995 చంద్రబాబును చూస్తారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తణికి నిర్వహిస్తాను.
స్కూళ్లు,డ్రైనేజీలను పరిశీలిస్తాను. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులే హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీరంతా అదే విధంగా పని చేసి అమరావతితో పాటు ఏపీని అభివృద్ధి చేయాలని”ఆయన పిలుపునిచ్చారు.