నిరుద్యోగ యువతకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.
అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం హాయాంలో కోర్టులోని పలు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియపై టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఈ కేసులపై లీగల్ ఓపినియన్ తీసుకుని ఆగస్టు నెలాఖరి వరకు షెడ్యూల్ ఖరారు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తుంది. 6,100పోస్టులకు గత ఏడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 95,206మంది అర్హతను సాధించారు. పీఎంటీ ,పీఈటీ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కోర్టు కేసులతో వీటికి బ్రేక్ పడింది.