Big Breaking News – BRSలోకి మరో 4గురు ఎమ్మెల్యేలు
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజమండీ.. ఏ ఎమ్మెల్యే అయిన ఏ నాయకుడైన సరే ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి చేరతారు.. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఇదే జరిగింది. కానీ తాజాగా ఈ రోజు జరిగిన ఓ పరిణామంతో పలు సంచనాలకు దారి తీస్తుంది.
ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ ను కల్సి బీఆర్ఎస్ లోనే ఉంటాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే..
తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భద్రాచలం కు చెందిన తెల్లం వెంకట్రావు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కల్సి కేటీఆర్ ను కల్సినట్లు తెలుస్తుంది.. వీరితో పాటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కాలే యాదయ్య, డా. సంజయ్ కుమార్ ,మహిపాల్ రెడ్డి తదితరులు తిరిగి బీఆర్ఎస్ లోకి రానున్నట్లు ఆ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు.. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో కాలమే తేల్చాలి.