చంద్రబాబు శుభవార్త

 చంద్రబాబు శుభవార్త

అమరావతిలో హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ..

గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ఈసందర్బంగా ప్రభుత్వం నిర్ణయించింది ..

మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లను ఏర్పాటు చేస్తాము . జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు శుభవార్తను తెలిపారు .

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *