జరా వీడియోలో మమ్మల్ని కూడా చూపించండి స్పీకర్ సాబ్ – హారీష్ రావు విన్నపం

 జరా వీడియోలో మమ్మల్ని కూడా చూపించండి స్పీకర్ సాబ్ – హారీష్ రావు విన్నపం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ఆదివారం సెలవు అనంతరం ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెల్సిందే..ఈ క్రమంలో సమావేశాలు ప్రారంభానికి ముందు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” అధికార పక్షం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి మొదలు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరీ వరకు.. అందర్నీ వీడియోలో చూపిస్తున్నారు..

బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు కూడా చూపించాలని గౌరవ స్పీకర్ గార్ని కోరుతున్నట్లు” తెలిపారు.. ఆ సమయంలో కుత్భూల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అవునవును అంటూ గట్టిగా అరుస్తూ బల్లాలు చరుస్తూ హారీష్ రావుకు మద్ధతుగా నిలిచారు..

దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ అలాంటిది ఏమి లేదు.. సభలో అందర్ని చూపిస్తున్నాము.స్పీకర్ గా నాకు ఎవరి పట్ల వివక్షత లేదు అని సమాధానమిచ్చారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *