జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ తదితర అంశాల గురించి జరుగుతున్న చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ” మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చరిత్ర అంతా హత్య రాజకీయాలు కిరాయి హత్యల మధ్యనే కొనసాగింది..
సూర్యాపేటలో ఓ రైస్ మిల్లులో జగదీష్ రెడ్డి లక్ష ఎనబై వేల రూపాయలను దొంగతనం చేశారు.. జగదీష్ రెడ్డిపై ఓ మర్డర్ కేసు నమోదైంది… ఆ కేసులో జగదీష్ రెడ్డి పదహారు ఏండ్లు కోర్టుల చుట్టూ తిరిగారు.. ఏడాది పాటు జిల్లా బహిష్కరణ కూడా చేశారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” సభలో నాపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి..
సభలో చేసిన వ్యాఖ్యలపై హౌజ్ కమిటీ వేయాలి. నాపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను.. తెలంగాణ ఉద్యమంలో నాపై కేసులు నమోదయ్యాయి.. రాష్ట్ర సాధన కోసం నేనేన్నో పోరాటాలు చేశాను.. ఎన్నో సార్లు జైలుకెళ్లాను.. పదవులకు రాజీనామా చేయకుండా పారిపోయి తెలంగాణకు ద్రోహాం చేసినవాళ్లా నాపై ఆరోపణలు చేసేది.. ఈ ఆరోపణలపై తక్షణమే క్షమాపణ చెప్పాలి.. లేదా నిరూపించండి..