గొర్రెల పథకంలో 700కోట్ల స్కాం
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి.. గొర్రెల పంపిణీ పథకంలో ఏడు వందల కోట్ల స్కాము జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” గొర్రెల పంపిణీ పథకంలో అనేక లోపాలు ఉన్నాయి..
ఆ పథకం అమల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు పలు స్కాములకు పాల్పడినారు. బీఆర్ఎస్ నేతల తీరు వల్ల.. పాలన వల్ల కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో స్కాములే.. బతుకమ్మ చీరల పంపిణీ,మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ ,కాళేశ్వరం లాంటి పథకాల్లో సైతం లక్షల కోట్ల స్కాములకు పాల్పడినారు అని అన్నారు.