భట్టి, రేవంత్ రెడ్డి లకు కేటీఆర్ వార్నింగ్

 భట్టి, రేవంత్ రెడ్డి లకు కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి..

అందుకే ఇటీవల కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు అని అన్నారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారని అంటున్నారు.ఇరువురి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ “ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు..

ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, మిమల్ని అడుగడుగునా ఎండకడ్తాం.”ఆరు గ్యారంటీలు అమలు అయ్యేదాకా మిమల్ని వదిలి పెట్టం.. ప్రజల తరుపున అడుగుతూనే ఉంటాం, కడుగుతూనే ఉంటాం అని అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *