జుట్టు రాలడానికి కారణాలు ఇవే..?
మగవారైన.. ఆడవారికైన సహాజంగా జుట్టు రాలుతుంది. ఈరోజుల్లో ఎక్కువగా ఆ సమస్యను అందరూ ఎదుర్కుంటూ ఉంటారు. జుట్టు రాలకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు.. మరెన్నో చిట్కాలను పాటిస్తాము. అయితే ముఖ్యంగా మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి,ప్రతి దానికి ఆందోళన చెందడం అని త్రయా అనే ప్రముఖ సంస్థ చేసిన అధ్యాయనంలో తేలింది.
ప్రపంచ వ్యాప్తంగా రెండులక్షల ఎనిమిది వేల మందిపై ఈ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో 71.19% మంది జుట్టు బాగా రాలుతుంది అని చెప్పారు. పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్న స్త్రీలకు హెయిర్ ఫాలో కూడా సమానంగా ఉంది అని తేలింది.
రోజూ వ్యాయమం చేయడం,ఫౌష్టికాహారం తీసుకోవడం,దుర అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా కొంతమేర జుట్టును రాలడం ఆరికట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.