గ్రూప్-2 వాయిదా…?
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రూప్-2 వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రియాజ్ నిరుద్యోగ జాక్ తో సమావేశమయిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో తమ డిమాండ్లను వివరించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాం,అకునూరి మురళిలతో కల్సి నిరుద్యోగ జాక్ తో సమావేశం కానున్నారు అని తెలుస్తుంది. గ్రూప్ -2 వాయిదా వేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గ్రూప్-2 డిసెంబర్ నెలలో నిర్వహించే అవకాశం కూడా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.