కేటీఆర్ కు బండి కౌంటర్
సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే…
తనకు మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ’కేటీఆర్ కు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా?.. వారి సమస్యలు ఇప్పుడు అర్ధమయ్యాయా..?సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు.
బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా చేశారు. తెలంగాణకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించినపుడు మీకు సిరిసిల్ల గుర్తురాలేదా?’ అని అయన కేటీఆర్ ను ప్రశ్నించారు.