ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎంపీగా గెలుపొందిన టీడీపీ యువ నేత, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
తన స్వీకారాన్ని ఆయన తెలుగులోనే పూర్తి చేయడం ఇక్కడ విశేషం. పార్లమెంటులో ఎంపీలు తమకు ఇష్టమైన భాషలో ప్రమాణం చేసేందుకు అవకాశం ఉంటుంది.