మాజీ మంత్రి హారీష్ రావు ఓ శిఖరం..!

 మాజీ మంత్రి హారీష్ రావు ఓ శిఖరం..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి  తన్నీరు హారీష్ రావు దేశంలోనే అత్యంత మెజార్టీతో  ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించిన నాయకుడు…మాజీ మంత్రి హరీష్ రావు గారిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర  వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి అన్నారు..

తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని మాత్రమే హరీష్ రావు గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ఎటు పోయింది. జాబ్ క్యాలెండర్ ఏమైంది?.అసెంబ్లీ ఎన్నికల్లో నిరుగ్యోగులను రెచ్చగొట్టి వారి కోసం మ్యానిఫెస్టో పెట్టిన మీరు ఈ రోజు ఆ అంశాలు పై మాట్లడరెందుకు?.బల్మూర్ వెంకట్ తో చర్చకు హరీష్ రావు కాదు నేను వస్తా.. నిరుద్యోగుల డిమాండ్ల పై చర్చిద్దాం వస్తావా అని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటినా నిరుద్యోగులకు ఒక్క కొత్త నోటిఫికేషన్ అయిన ఇచ్చారా?.మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగులు ఇచ్చారో చర్చకు సిద్ధమా?.బీఆర్ఎస్ పార్టీ 10.సం.రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో, విద్యార్థులకు ఏం చేశామో మాట్లాడుకుందాం.

నిరుద్యోగులు గ్రూప్స్ ఉద్యోగాల్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ తో పాటు ఇంకా కొన్ని సమస్యలపై మాట్లాడితే వారిని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని నిరుధ్యోగులు వాపోతున్నారు.ఖబడ్డార్ కాంగ్రెస్ నాయకుల్లారా నిరుద్యోగుల జోలికి వస్తే ఊరుకోము..హరీష్ రావు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలు సమస్యల కోసం వచ్చే వారికి భోజనం పెట్టి సమస్య పరిష్కరించే వారు.

హరీష్ రావు గారు 14సం.రాలు ఉద్యమం, 10సం.రాలు అధికారంలో ఉన్న నికార్సయిన ఉద్యమ కారుడి గురించి మాట్లాడే స్థాయి వెంకట్ ది కాదు.పెద్దల సభ కు వెళ్లిన బల్మూర్ మరీ చిన్నగా ప్రవర్తించవద్దు.వెంకట్ ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. ఏదీ పడితే అది మాట్లాడితే ఊరుకోము..నిరుద్యోగుల పక్షాన మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి తప్ప పిచ్చిగా మాట్లడి పెద్ద వాళ్ళను విమర్శిస్తే పెద్ద వాళ్ళు కారు అని హెచ్చరించారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *