డిప్యూటీ సీఎంగా జనసేనాని
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164స్థానాల్లో.. అధికార వైసీపీ పార్టీ పదకొండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు అయ్యారు.
మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే వెల్లడించింది.
అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు జనసేనాని తన సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న ఆదివారం ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇండియా టుడే కి చెందిన ఓ జర్నలిస్టు ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు.
కాగా పదవి విషయంపై పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. ఎన్డీఏ ఎమ్మెల్యేల భేటీలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.