మంత్రి ఇలాఖాలో రైతు ఇక్కట్లు
తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన మంథని నియోజకవర్గం మల్హర్రావు మండలం ఎడ్లపల్లి గ్రామంలో నెలన్నర రోజులు అయినా ప్రభుత్వం వడ్లు కొనట్లెదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో రైతులు మాట్లాడుతూ మళ్ళీ పంటలు వేసుకునే కాలం వచ్చింది.. ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదు..
ఈ పంట డబ్బులు ఎప్పుడు రావాలి, మేము ఎలా పెట్టుబడి పెట్టి పంట వేసుకోవాలని బాధలు చెప్పుకున్నారు రైతన్నలు.