బూతుల మంత్రులకు గట్టి షాకిచ్చిన ఏపీ ఓటర్లు
పదవిలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేసేవాళ్లనే ఓటర్లు ఓడించే రోజులు ఇవి.
అలాంటిది పదవుల్లో ఉన్నామనో.. అధికారంలో ఉన్నామనో.. లేదా తాము మంత్రులమనో విర్రవీగుతూ బూతుల పురాణం చదివితే టైం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారనడానికి ఏపీలో తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రుల సంఘటనలను చూస్తే ఆర్ధమవుతుంది.
గత ఐదేండ్లలో మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా, అంబటి రాంబాబు,సీదిరి అప్పలరాజు,జోగి రమేష్ లతో పాటు అనిల్ కుమార్ యాదవ్,వల్లభనేని వంశీ అందరూ ఓటమి పాలయ్యారు. అయితే వీరు ప్రజాసేవ చేయకపోగ వీరు వాడిన భాష ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిందని విశ్లేషకుల అంచనా.