ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆజన్మ తెలంగాణ వాది
‘ఆనాడు నా సలహాదారుగా, సహచరుడిగా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి మాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. అయన అన్ని సందర్భాల్లో నాతోపాటు ఉండేవారు. ఆయన చాలా గొప్పవారు.
కఠోరమైన సిద్ధాంతాలను నమ్మే పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చిందంటే దాన్ని పక్కనవెట్టి కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఆజన్మ తెలంగాణ వాది. 14, 15 ఏళ్లు నేను ఆయనతో కలిసి పనిచేసిన. ఆనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ వ్యథల గురించి చెప్పేవారు.
ఈ సందర్భంలో ఆయనను స్మరించుకోకుండా నేను ఉండలేను. అలాంటి మనుషులు ప్రపంచంలో అరుదుగా ఉంటారు’అంటూ జయశంకర్ సార్ గురించి మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురైయ్యారు ఉద్యమ యోధుడు, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.