ఇంట్లో అందరూ ఒకే సబ్బును వాడుతున్నారా..?
సహాజంగా ఇంటిలో ఎంతమంది ఉన్న కానీ స్నానం చేయడానికి ఒకే సబ్బును వాడటం.దంతాలను తోముకోవడానికి టూత్ పేస్ట్ వాడటం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఇంటిలో ఉన్నవాళ్లంతా ఒకే సబ్బును వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు..పరిశోధకులు..
సాధారణంగా మనం ప్రతిరోజూ స్నానానికి ఉపయోగించే సబ్బుపైకి సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా, నోరోవైరస్, రోటవైరస్, స్టాఫ్ వంటి వైరసులు చేరతాయి.
ఒక వ్యక్తి ఉపయోగించిన సబ్బు వేరే వ్యక్తి ఉపయోగించడం వల్ల ఈ వైరస్లు మిగిలిన వారికి వ్యాపించే ప్రమాదం ఉంది. చర్మంపై కోతలు, గాయాలు, గీతల ద్వారా ఇవి వ్యాప్తి చెందుతాయి.
దీని వల్ల చర్మ వ్యాధులు, జలుబు, ఇతర సమస్యలు కూడా వస్తాయి. చర్మ సమస్యలు, అలర్జీలు ఉన్నవారు విడిగా సబ్బు వాడాలి. అందుకని ఇంట్లో వారందరూ ఒకే సబ్బును వాడకపోవడమే మంచిది. .