విఘ్నేశ్వరుని దయతో విఘ్నాలన్నీ తొలగాలి – ఎమ్మెల్యే గండ్ర

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :
వినాయక చవితి పర్వదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది.. పూజించేది విగ్నేశ్వరున్నే అని, విగ్నేశ్వరుని అనుగ్రహముతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఎలాంటి విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించారు. ప్రతి ఇంటిలో మట్టి గణపతిని పూజించాలని, పర్యావరణహిత మట్టి గణపతిని పూజించడం శ్రేష్టమని ఎమ్మెల్యే అన్నారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తి శ్రద్ధలతో వినాయకున్ని ప్రార్థించి దేవ దేవుని అనుగ్రహం పొందాలని ఈరోజు(మంగళవారం) భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి మీడియాకు ప్రకటన విడుదల చేశారు.