జాతీయ క్రీడా దినోత్సవం – సైక్లింగ్ ర్యాలీకి ముఖ్య అతిథిగా గవర్నర్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 31వ తేదీ, ఆదివారం నిర్వహించబడుతున్న సైక్లింగ్ ర్యాలీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
ఈ మేరకు తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవిలు ఈ రోజు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు. “ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్” కార్యక్రమం భాగంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు గవర్నర్‌కు వివరించారు.
ఆగస్టు 31వ తేదీ ఉదయం 7 గంటలకు గచ్చిబౌలి స్టేడియం మెయిన్ గేట్ వద్ద సైక్లింగ్ ర్యాలీ ప్రారంభం కానుంది. గవర్నర్ ఈ ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించి, తప్పకుండా హాజరవుతానని తెలిపారు.