ఖైరతాబాద్ గణేషుడ్ని దర్శించుకోవడానికి వెళ్తున్నారా..?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రతి ఏడాది వినూత్నంగా దర్శనమిచ్చే గణేషుడు ఈ ఏడాది ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమి వ్వనున్నారు.ఈ రోజు ఉదయం 6 గంటలకు తొలి పూజ, 10 గంటలకు కలశపూజ, ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది.
ఈ కార్య క్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. అనంతరం 69 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుడి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అయితే ఖైరతాబాద్ గణేషుడ్ని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు ఇది తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు..
ప్రతిరోజు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఉ.6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉంటుంది..సాధ్యమైనంత వరకు ప్రజారవాణా మార్గాల్లోనే దర్శనానికి రావాలని పోలీసులు సూచిస్తున్నారు. భక్తులు సొంత వాహనాల్లో వస్తే పార్కింగ్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని, 60 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. విలువైన వస్తువులు, ఆభరణాలు ధరించొద్దని సూచించారు..