ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్.!

 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్.!

mla

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరింది. అయిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ దేశ ఆత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

దీంతో సుప్రీం కోర్టు మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ న్యాయసలహా తీసుకున్నారు. అందులో భాగంగానే పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారికంగా గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫాం పై బరిలోకి దిగి టెక్నికల్ గా అనర్హత వేటుకు గురయ్యారు.

మరో ఎమ్మెల్యే అయిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి తన కూతురు వరంగల్ ఎంపీ కడియం కావ్య తరపున కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పలుమార్లు బహిరంగంగానే కోరారు. ఇంకో ఎమ్మెల్యే అయిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కారణాలతో ఈ ముగ్గురిపై అనర్హత వేటు పడటం ఖాయం అని తేలుస్తుంది. మరో ఏడుగురి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *