రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..?

Night Dinner
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రస్తుత రోజుల్లో బిజీ బిజీ లైఫ్ లో చాలా మంది తీసుకునే ఆహారం విషయంలో , పాటించే డైట్ విషయంలో సమయపాలనా పాటించరు. కొందరూ రాత్రి తొమ్మిది గంటల తర్వాత భోజనం చేస్తుంటారు.
ఇలా చేస్తే చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా భోజనం తీసుకుంటే క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు, డయాబెటిస్ -2 , ఊబకాయం , ఎసిడిటీ, ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ప్రతిరోజూ రాత్రి పూట నిద్రకు కనీసం మూడు గంటల ముందు భోజనం చేయాలి.కొవ్వులు చక్కెరతో కూడిన ఆహారం తగ్గించాలని కూడా వారు సూచిస్తున్నారు.