కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు..!

kalvakuntla kavitha
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఏసీబీ విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే.
అయితే, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ” ప్రజా సమస్యలను దృష్టి మళ్లించడానికే కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి నోటీసులు జారీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఆరోపించారు. ఏసీబీ నోటీసులు జారీ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు” పేర్కొన్నారు..