రేవంత్ సర్కారును కూలగొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్లు ఆఫర్…!

CM Revanth Reddy
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలుగా ఏ వర్గం వాళ్ళు ఆనందంగా లేరు. పేద ధనిక మధ్య తరగతి ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తే పది హేను నెలల్లోనే నరకాన్ని చూపిస్తున్నారు.
ఏ ఒక్క పని కావడం లేదు. అఖరికీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేయలేదు. హైడ్రాను తీసుకు వచ్చి రియల్ ఎస్టేట్ ను పడగొట్టారు. అసలు రియల్ భూమ్ లేదు. కాంగ్రెస్ పాలనలో విసుగెత్తి వ్యాపారవేత్తలు.. రియల్ ఎస్టేట్ వాళ్లు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని తమకు చెబుతున్నారు అని బీఆర్ఎస్ కు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దుబ్బాకలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడూతూ కాంగ్రెస్ పాలనలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. అన్ని వర్గాల వారు విసిగిపోయారు. ఈసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
