మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..?

సింగిడిన్యూస్ – ఇబ్రహీం పట్నం
హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్నయి. ఈ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు గాంధీభవన్ లో టాక్.
త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి,మహబూబ్ నగర్ కు చెందిన మరో ఎమ్మెల్యే వాకాటి శ్రీహారి ముదిరాజు కు చోటు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో నాకు మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అల్టీమేటం జారీ చేశారు . ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో నా కులమే అడ్డు అయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే సామాజిక వర్గానికి చెందిన నేతను ఎమ్మెల్యేగా గెలిపిస్తాను. అతనికివ్వండని సూచించారు . మంత్రివర్గ విస్తరణలో మల్ రెడ్డి రంగారెడ్డికి స్థానం దొరకడం..ఇవ్వకపోతే ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేయడం రెండు జరగవని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
