ఉగాది కి మంత్రి వర్గ విస్తరణ – బీఆర్ఎస్ లోకి 7గురు ఎమ్మెల్యేలు..!

Cabinet expansion for Ugadi – 7 MLAs join BRS..!
ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ల బృందం ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్,ఏఐసీసీ అధ్యక్షులు మల్లుఖార్జున ఖర్గే లతో సుధీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రివర్గ విస్తరణ.. నామినేటేడ్ పోస్టుల భర్తీ లాంటి పలు అంశాల గురించి చర్చించారు.
ఉగాది పండుగక్కి జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం లేకపోతే బీఆర్ఎస్ లో చేరేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈరోజు మంగళవారం సుప్రీం కోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో అనర్హత వేటు పడటం ఖాయం అని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆర్ధమైంది. ఇటు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కక.. అటు పార్టీలో సరైన గౌరవం లేకపోవడంతో వ్రతం చెడిన ఫలితం దక్కాలనే నీతితో పార్టీ మారి ఇజ్జత్ పోయింది.
ఈ క్రమంలో మళ్లీ పార్టీలో చేరి ఉన్న కాస్త పరువు కాపాడుకోవాలని కొంతమంది ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. మరోవైపు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమపై అనర్హత వేటు పడటం తప్పదని గ్రహించి ఉప ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటీకి చేరాలని ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే తమకు అనుకూల బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కేసీఆర్ తో సంప్రదింపులు జరిపారు కూడా.!