రేవంత్ రెడ్డికి అస్కార్ అవార్డు…!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్కార్ అవార్డు రావడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. పోనీ మన సీఎం రేవంత్ రెడ్డి ఏమైన నటుడా..?. ఆయన ఏమైన సినిమాల్లో నటించారా..?. ఆయన ప్రతిభకు.. నటనకు ఏమైన మెచ్చి ఈ అవార్డు ఇచ్చారా అని ఆలోచిస్తున్నారా..?. సినిమాలకు కాదండోయో..సోషల్ మీడియాలో.. మీడియాలో ఎవరూ బూతులు మాట్లాడోద్దు. తాను మాత్రం అసెంబ్లీలో బూతులు మాట్లాడోచ్చు అంటున్న రేవంత్ రెడ్డి నటనకు.. డ్రామాటిక్ కు మెచ్చి అస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ “సంస్కారానికి ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి అని ఆయన విమర్శలు చేశారు.
మాజీ మంత్రి హారీష్ రావు ఇంకా మాట్లాడుతూ “సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కలిసి నిర్మించిన గాలి మేడ ఈ బడ్జెట్. ఎన్నికల ముందు పాతాళ భైరవి… నరుడా ఏమి నీ కోరిక..?.ఎన్నికల తర్వాత… పాపాల భైరవి. నన్నేం అడుగకు, నాకేం తెల్వది. డిసెంబరు 9, 2023 వరకు అమలు చేస్తామన్న వాగ్దానాలు అమలుకావడానికి ప్రజలు ఇంకా ఎన్ని డిసెంబర్లు ఎదురు చూడాలో. రావాల్సిన డిసెంబరు అసలు వస్తుందో రాదో అనే అనుమానాలు ముసురుకున్నాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమార ప్రగల్బాలు. వ్యక్తిగత దూషణలతో మార్చురీ కంపు కొడుతున్నసీఎం హేయమైన ప్రసంగాలను వినలేక జనం ఛీ కొడుతున్నారు.
చెవులకు చిల్లులు పడుతున్నాయి గానీ చేయూత పించన్లకు చిల్లి గవ్వ రాలడం లేదు అని విమర్శించారు . ముఖ్యమంత్రి ఇదే అసెంబ్లీలో ఏమన్నారు అధ్యక్షా.. ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెబుతున్నాను… ఒక్కనొక్కని తోడ్కలు తీస్త,బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుత.’’ అన్నడు. నిండు సభలో చైర్‌ను ఉద్దేశించి చెప్పగల ముఖ్య మంత్రి సంస్కారం ఎంత గొప్పది అధ్యక్షా? ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మీరు పెట్టగలిగే పూర్తి స్థాయి బడ్జెట్లు నాలుగే. అందులో రెండు బడ్జెట్ లు పూర్తయి పోయాయి. మిగిలినవి రెండే… అంటే పుణ్యకాలం కాస్తా కరిగిపోతున్నది కానీ మీరు చూపించిన కలలు మాత్రం నిజమయ్యే దాఖలా కనిపించటం లేదు.
మీ ప్రతికూల పాలసీలు, ప్రతీకార రాజకీయాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. రాష్ట్ర ఆదాయ వనరులు ఒకటొకటిగా తగ్గుతున్నాయి. మేము పెంచుతూ వచ్చిన ఆదాయాన్ని మీరు తగ్గిస్తూ పోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ముందు ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నది. అర చేతిలో వైకుంఠం చూపించిన అభయహస్తం మ్యానిఫెస్టో ఇక శూన్య హస్తమేనని మీ రెండు వార్షిక బడ్జెట్ లు తేల్చేశాయని ఆయన పేర్కొన్నారు.