కడియం శ్రీహారి బాటలో దానం నాగేందర్..!

Danam Nagender follows in the footsteps of Kadiyam Srihari..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు స్టేషన్ ఘన్ పూర్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి కాదు.
కేవలం స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు మీకోసం.. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాను. నాకు నేను చెప్పిన పనులు నియోజకవర్గ ప్రజల కోసం చేయాలని కోరారు. అందుకే ఇవన్నీ ఆయన సెలవిచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే కడియం శ్రీహారి మాట్లాడుతూ నేను పార్టీ మారింది నాకోసం కాదు. నాకు పదవుల కోసం కాదు. నేను ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా.. మంత్రిగా.. ఉప ముఖ్యమంత్రిగా చేసిన . నాకు ఇంకా ఏమి పదవులు వద్దు. కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారిన అని సెంట్మెంట్ డైలాగ్స్ పేల్చారు.
పరోక్షంగా ఇటు వేటు పడటం కానీ అటు కడియం శ్రీహారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా కానీ చేయడం పక్కా . సో వీరిద్దరూ చేసిన ప్రసంగం విన్నాక పక్కాగా ఉప ఎన్నికలు రావడం ఖాయం అని తేలింది. ఫిరాయింపుల కేసు సుప్రీం కోర్టులో ఉండటం. పార్టీ మారడమే కాకుండా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎంపీగా బరిలోకి దిగిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కడియం శ్రీహారి బాటలో నడవాలని ఆనుకుంటున్నారు అంట.
అందుకే త్వరలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపలు చేయించుకోవాలి. ఎక్కువ మొత్తంలో నిధులు తెప్పించుకోని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తన అనుచరుల దగ్గర దానం చెబుతున్నట్లు టాక్.చూడాలి మరి దానం కూడా కడియం బాటలో నడుస్తారేమో..!
