కాంగ్రెస్ పై ప్రేమతో కాదంట కేసీఆర్ పై వ్యతిరేకత.!

Opposition to KCR is not due to love for Congress!
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాల్లో… బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో.. ఎంఐఎం ఏడు స్థానాల్లో .. బీజేపీ ఎనిమిది స్థానాల్లో.. సీపీఐ ఒక స్థానంలో గెలుపొందిన సంగతి తెల్సిందే. తాజాగా నిన్న శనివారం అసెంబ్లీ సమావేశాలనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ ఛాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై.. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతో మమ్మల్ని గెలిపించారు.
ఈసారి మాపై ప్రేమతో.. మేము చేసే మంచి పనులతో గెలిపిస్తారు అని కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో గెలుస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం ఒకే బాగుంది. ఎవరైన ఎన్నికల సమరంలో గెలవాలనే నమ్మకంతోనే పట్టుదలగా ఉంటారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి. కానీ ఆయన అన్నట్లు కాంగ్రెస్ పై ప్రేమతోనో.. కేసీఆర్ పై వ్యతిరేకతతోనో కాంగ్రెస్ ను గెలిపించలేదు. కేవలం గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరుగ్యారంటీలను నమ్మి.. నాలుగోందల ఇరవై హామీలపై ఆశతో గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్న కానీ ఇంతవరకూ ఒక్క గ్యారంటీ ని కూడా పూర్తిగా అమలు చేయలేదు.
రేవంత్ రెడ్డికి ఇంటబయట వ్యతిరేకతతో పాటు అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత మూటకట్టుకున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈసారి కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. తానే ముఖ్యమంత్రి అవుతానని అనడం ఆయన రాజకీయ పరిపక్వత ఇంకా మెరుగుపడలేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్, హారీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై.. హామీల అమలుపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మరోవైపు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే నయం అనే స్థాయికి వచ్చారు. రేవంత్ ఇలాగే మాటల గారడీతో ఉన్న నాలుగేండ్లు కాలం గడిపితే మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకతతో.. బీఆర్ఎస్ పై ప్రేమతో కేసీఆర్ ను గెలిపించడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
