బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ సీనియర్ నేత చూపు..!

congress senior leader look into brs
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారా..?. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగంటల కరెంటు ఇస్తే నేను ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను అని ప్రకటించిన మాజీ మంత్రి జానారెడ్డి అది నిజం చేయనున్నారా..?. ఇప్పటికే ఒక కొడుకు ఎంపీ.. ఇంకో కుమారుడు ఎంపీగా ఉన్న తన కుమారుల రాజకీయ భవిష్యత్తు గురించి ఈ నిర్ణయం తీసుకోనున్నారా ..?. అంటే అవుననే అన్పిస్తుంది నిన్న బుధవారం సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారించిన తీరును చూస్తే.
బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో మాజీ మంత్రి కందూరి జానారెడ్డి తనయుడు.. నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ఆ భేటీ మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఇంత సీరియస్ గా చర్చ జరుగుతుండగా ఎమ్మెల్యే ఎలా లేచిపోతాడు. క్రమశిక్షణ అసలు లేదు. జయవీర్ ఏ పని అడిగిన నన్ను అడగకుండా.. నా అనుమతి లేకుండా అతనికి చేయద్దు అని హుకూం జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికెళ్ళి భేటీ అయ్యారు. తన తీరుతో ఇటు పార్టీలో అటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జానారెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు పోస్టు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యం వల్ల భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడ ఉండదు. ఇప్పుడిప్పుడే తన కుమారులు రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలో అన్ని ఆలోచించి అడుగులేయాలని భావించిన సదరు మాజీ మంత్రి ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది.
దీంతో ఆ ప్రస్టేషన్ తో ఇప్పటికే మాజీ మంత్రి జానారెడ్డి బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. గతంలో కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అందరికంటే తానే ముందు వెళ్ళడం.. పలుమార్లు గతంలో ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి తాజాగా సీఎల్పీ భేటీలో జయవీర్ వ్యవహారించిన తీరుతో పక్కా సమాచారంతో వీళ్ళు పార్టీ మారడం ఖాయం అని ఆలోచించే సహచర మంత్రులకు జయవీర్ కు ఏ పని చేయద్దు అని హూకుం జారీ చేశారు అని ఇటు గాంధీ భవన్ లో అటు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు.
