కేసీఆర్ పై గుడ్డి ద్వేషంతో మేడిగడ్డకు అన్యాయం!

Injustice to Medigadda due to blind hatred towards KCR!
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై గుడ్డి ద్వేషంతో రాష్ట్ర రైతాంగానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టులలో ఒక బ్యారేజ్ అయిన మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు ఎండి పోయాయి.
ముఖ్యమంత్రి రేవంత్ అనే చేతకాని సీఎం వల్ల లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి.ఎండిపోయిన పొలాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి .. ఆత్మహత్యలు చేసుకున్న నాలుగోందల ఎనబై మంది రైతన్నల కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
