రేవంత్ రెడ్డిని తిడుతూ పైశాచిక ఆనందం..!

Devilish joy while cursing Revanth Reddy..!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనను అందరూ తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఫరెడ్ గ్రౌండ్ లో జరిగిన మహిళా శక్తి భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” కరెంటు కట్ అయిన నన్నే తిడుతున్నారు.
రోడ్డు ప్రమాదం జరిగిన నన్నే తిడుతున్నారు. కాళేశ్వరం కూలిన నన్నే తిడుతున్నారు.ఎండకు పంటలు ఎండిన నన్నే తిడుతున్నారు. అఖరికీ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన నన్నే తిడుతున్నారంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు చెందిన నేతలు తనను పని చేస్కోనివ్వకుండా నిత్యం విమర్శలు వర్శం కురిపిస్తున్నారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం కూడా ఇవ్వడం లేదు. ప్రతిదానికి నన్నే కార్నర్ చేసి తిడుతున్నారు. నన్ను తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వోచ్చు కదా అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.
