బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూమి కబ్జా చేసిన కాంగ్రెస్ నేత..!

Congress leader who seized BRS MLC’s land..!
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిన భూములను అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరూ కబ్జా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ లో తనకు చెందిన భూమిలోని ప్రహారీ గోడలను కూల్చివేసి కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఎమ్మెల్సీ నవీన్ రావు ఆరోపణలు చేశారు.
ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్సీ నవీన్ రావు ఆవేదనను వ్యక్తం చేశారు.
