మాజీ మంత్రి కేటీఆర్ పై నెటిజన్లు అగ్రహాం..!

Netizens are angry at former minister KTR..!
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నెటిజన్లు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ లో ” తెలంగాణకు రావాల్సిన రూ.1700 కోట్ల సోలార్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడంపై చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది.
ట్విట్టర్ లో కేటీఆర్ ‘మా పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు ఆఖరుకు ఏపీని ఎంచుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ ‘ఆఖరుకు’ అనే పదం ఎందుకు వాడారు.. అంటే ఏపీ పెట్టుబడులకు పనికిరాదా?.. ఆ అహంకారం ఏంటని ఆయనపై నెటిజన్లు ఫైరవుతున్నారు.

