రేవంత్ రెడ్డి కి బిగ్ షాకిచ్చిన అల్లు అర్జున్ మామ ..

ఇటీవల పుష్ప 2 విడుదల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందటంతో సినీ హీరో అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ తన ఇంటిని కూల్చొద్ధు.
పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేసారు కాంగ్రెస్ నేత (అల్లు అర్జున్ మామ) చంద్రశేఖర్ రెడ్డి..ఇప్పటికే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టులో పెండింగ్లో నాలుగు పిటిషన్లు ఉన్నట్టు తెలుస్తుంది.
పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూరా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నదని.. ఈ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ ఇప్పటికే ప్రజావాణిలో దరఖాస్తు చేసారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పలువురు సినీ ప్రముఖుల ఇండ్లు కూడా కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి..
